ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమ్మెటివ్ పరీక్షల ప్రశ్నాపత్రాలను ఒకేరోజు పాఠశాలలకు పంపిణీ చేయాలని ఎపిటిఎఫ్ కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం జరిగే ప్రశ్నాపత్రాలు ఉదయం పూట, మధ్యాహ్నం జరిగే పరీక్షకు మధ్యాహ్నం పూట గంట ముందు వచ్చి తీసుకెళ్లాలని అధికారులు ఆదేశాలివ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మండల కేంద్రానికి రెండుపూటలా వచ్చి పేపర్లు తీసుకెళ్లడం సాధ్యం కాని పని అని తెలిపారు. పరీక్షల ముందురోజు గానీ, స్కూల్ కాంప్లెక్స్ నుంచి రెండు రోజులకోసారి పంపిణీ అయ్యే విధంగా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
