ఏపీ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు

Jun 11,2024 13:15 #ap governer, #BJP, #JanaSena, #TDP

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్ కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు.

➡️