మే 2న అమరావతి పున:ప్రారంభం

Apr 16,2025 05:53 #amaravati, #ap government, #May 2nd, #reopen

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతి నగర వసులను మేనెల 2వ తేదిన పున: ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో కొద్దిసేవు ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశాన్ని ప్రస్తావించిన సిఎం వనుల వస:ప్రారంభ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారని సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి సరేంద్రమోడీని ఆహ్వానించామని, హాజరు కావడానికి ప్రధాని అంగీకరించారని మంత్రులకు సిఎం చెప్పినట్లు తెలిసింది. ప్రధాని హాజరువుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను నక్రమంగా చేయాలని ఆయన సూచించారు.

మంత్రుల పేషీలపై సీరియన్

అధికారుల తీరుపైనా గట్టిగానే చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఓఎన్ల వంటి అధికారులపై పదేపదే ఆరోపణలు వస్తుండటంతో ఆయన తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. ఇకపై అటువంటి విమర్శలు కొనసాగితే కఠిన చర్యలు తప్పపని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. ఇదే సమయంలో కొంతమంది మంత్రులకూ ఆయన చురకలు అంటించినట్లు తెలిసింది. వారు కూడా తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని తేల్చిచెప్పినట్లు సమాచారం.

వైసిపి తీరుగు అడ్డుకోవాలి

రాష్ట్రంలో వైసిపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు ఈ సందర్భంగా ఆరోపించినట్లు నమాచారం. వక్స్ బిల్లుపై ముస్లింలను, గోవుల మరణాల పేరిట హిందువులను, పాస్టర్ ప్రవీణ్ మృతిపై క్రైస్తవులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఇంకా వివరాలు బటకు రాకముందే అతనిని హత్య చేశారంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగా ఆరోపణలు చేసిన విషయాన్ని కొందరు మంత్రులు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. తిరుమలలో గోవుల మరణాలసంకూడా రాజకీయం చేశారని, గత ప్రభుత్వ హయాంలో గోరక్షణ కేంద్రాలను నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు గోపులకు రక్షణ లేదంటూ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీని పైనా దర్యాప్తు చేయించాలని కొంతమంది మంత్రులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇక వక్స్ బిల్లుకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటుచేసిన ఆ పార్టీ రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటుచేసి ద్వంద్వ విధానాన్ని బయట పెట్టుకుందని అన్నారు. చివరకు దీనిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూ సంప్రీంకోర్టులో పిటిషన్ వేశారని, ఇది ఎలా నడడు అవుతుందని కొందరు మంత్రులు ప్రశ్నించినట్లు సమాచారం.

➡️