ప్రజాశక్తి-అమరావతి : రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవసరమవుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా… వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ. 31,000 కోట్లు సమకూరాయని తెలిపారు. ఇంకా కావాల్సిన నిధులు రూ.47,000 కోట్లు అని వివరించారు.
