ఆర్‌జియుకెటి ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా అమరేంద్రకుమార్‌

ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌ : ఏలూరు జిల్లా నూజివీడు ఆర్‌జియుకెటి (రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌) క్యాంపస్‌ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా, క్యాంపస్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా అమరేంద్ర కుమార్‌ సండ్ర బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆర్‌కె వ్యాలీ క్యాంపస్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఇక్కడ నియమితులయ్యారు. 2016లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేరి 2021లో ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఆర్‌కె వ్యాలీ క్యాంపస్‌లో పరిపాలనా విధులు నిర్వహించారు. యుజి-2024 అడ్మిషన్స్‌ కన్వీనర్‌గానూ వ్యవహరించారు. ఆయనను ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌గా నియమించడంపై అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

➡️