అంబేద్కర్‌ ఆశయాలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి : వైఎస్‌.జగన్‌

తాడేపల్లి (అమరావతి) : ” అంబేద్కర్‌ ఆశయాలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకం ” అని వైఎస్‌.జగన్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని … అంబేద్కర్‌కు వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించారు. ట్విట్టర్‌ వేదికగా …. ” రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్‌ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్‌ ఆశయాలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకం. ” అని పేర్కొన్నారు.

➡️