ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శిక్షణ కోసం లక్షద్వీప్‌కు వెళ్లిన అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి(పిసిసిఎఫ్)((బడ్జెట్)) రమేష్‌కుమార్ సుమన్ గుండెపోటుతో గురువారం అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలియడంతో అధికారవర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిఎం ఆదేశాలతో ఆయన మృత దేహాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1993 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన రమేష్ అటవీశాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా, విభజన తరువాత ఎపి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పిసిసిఎఫ్‌తో పాటు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రమేష్‌కుమార్ అంకిత భావంతో రాష్ట్రప్రభుత్వంలో 32 ఏళ్లుగా ఆదర్శవంతంగా సేవ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం తోడుగా ఉంటుందని తెలిపారు.
