ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : ఓటేసేందుకు క్యూ లైన్‌లో నిలబడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం నెల్లిమర్ల మండలం, తంగుడుబిల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద జరిగింది. తంగుడుబిల్లి పోలింగ్ బూత్ వద్ద పాలూరి పెంటమ్మ (65) ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉండి ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. ఈ సంఘటనతో ఓటర్లంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. వెంటనే ఆమె మృతదేహాన్ని అక్కడి నుండి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు.
ఓటేసేందుకు క్యూలో నిలబడి కుప్పకూలి వృద్ధురాలు మృతి
