ప్రజాశక్తి – విజయవాడ : కుటుంబ కలహాల నేపథ్యంలో విజయవాడ రామలింగేశ్వర్‌నగర్ స్క్రూబ్రిడ్జిపై నుంచి బందరు కాల్వలో దూకి గల్లంతైన తిరుపతి సుధారాణి, ఆమె కుమార్తె జ్వాసి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎనిమిది మందితో కూడిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం, బోట్ సాయంతో పోలీసులు బందరు కాల్వలో చోడవరం వరకు సుమారు 15 కిలోమీటర్ల పొడవునా గాలించింది. అయినా వారి ఆచూకీ లభించలేదు. వల్లూరు వారిపాలెం, కంకిపాడు లాకుల వరకు కూడా మృతురాలి కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదని మృతురాలి బావ కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు. మంగళవారం కూడా గాలింపు చర్యలు కొనసాగుతాయని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం పేర్కొంది.