జగన్‌ చర్యలతో ప్రజలపై పెనుభారం : ఆనం వెంకట రమణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చర్యలతో రాష్ట్ర ప్రజలపై పెనుభారం పడుతుందని ఆనం ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ చైర్మన్‌ వెంకట రమణారెడ్డి అన్నారు. విద్యుత్‌ కొనుగోలులో ఆదాని సంస్థ నుంచి జగన్‌కు రూ.1750 కోట్ల లంచం ముట్టిందని అమెరికాలోని ఎఫ్‌బిఐ తేల్చిందని అన్నారు. టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ వద్ద ఉన్న 9 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ కొనాలని ఇతర రాష్ట్రప్రభుత్వాలను సెకి కోరినా తిరస్కరించాయని చెప్పారు. జగన్‌ మాత్రం మార్కెట్‌ ధర కంటే అధికంగా కొన్నారని విమర్శించారు. అమెరికాలో ఈ కేసులో ఏడాదిలోపు జడ్జిమెంట్‌ వస్తుందని చెప్పారు.

➡️