ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రైతు ఉద్యమాన్ని అవహేళనచేసిన కంగనా రనౌత్‌పై చేయి చేసుకున్న సిఐఎస్‌ఎఫ్ జవాన్‌పై సస్పెన్షన్, క్రిమినల్ కేసులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. మూడు నల్లచటాద్టలకు వ్యతిరేకంగా 13 నెలలకుపైగా ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా ఆ ఉద్యమంలో పాల్గన్న రైతులు ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన అవహేళనను నిరశిస్తూ ఛండీగఢ్ విమానాశ్రయంలో ఈ నెల 4న ఒక రైతుబిడ్డ స్పందనగా సిఐఎస్‌ఎఫ్ జవాన్ కుల్‌వీందర్‌కౌర్ చర్యను చూడాలని వారు కోరారు. క్రిమినల్ కేసు కింద అరెస్టు నుండి ఆమెకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా కంగనా రనౌత్ లాంటి వారు రైతుల ఉద్యమాన్ని అవహేళన చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.
