ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తెలంగాణ నుంచి ఎపి కేడర్‌కు కేటాయించిన ఇద్దరు ఐపిఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు జిఓఆర్‌టి నెంబరు 705ను సోమవారం విడుదల చేసింది. జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్‌గా అంజనీకుమార్‌ను నియమించారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతున్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్‌ను రిలీవ్ చేశారు. అభిలాష్‌బిస్తాను ఎపి రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సెలవులో ఉండటంతో సెలవు పూర్తికాగానే బాధ్యతలు స్వీకరించాలని జిఓలో పేర్కొన్నారు.
