99 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా

Feb 25,2024 08:27 #JanaSena, #TDP

-విడుదల చేసిన చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌

-జనసేనకు 24 అసెంబ్లీ -3 ఎంపి స్థానాలు

-ఓటు బదిలీ జరగాలన్న ఇరు పార్టీల అధినేతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశాంజనసేన పార్టీల శాసనసభ అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఉమ్మడిగా శనివారం ఉదయం ఈ జాబితాను విడుదల చేశారు. చంద్రబాబునాయుడి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని, 25 లోక్‌సభ స్థానాల్లో 3 స్థానాల్లో బరిలోకి దిగుతుందని ఈ సందర్భంగా ఇరుపార్టీల నేతలు ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో టిడిపి పోటీ చేస్తుందని తెలిపారు. ‘బిజెపి కూడా కలిసివస్తే ఆ పార్టీకి కేటాయించే సీట్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’ అని చంద్రబాబు చెప్పారు. తమ పొత్తును ఆశ్వీర్వదించి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఓటు బదిలీ జరిగేలా ఇరు పార్టీల కార్యకర్తలు తప్పనిసరిగా చూడాలని కోరారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే : చంద్రబాబు నాయుడు

రాష్ట్ర భవిష్యత్తు కోసమే టిడిపి -జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రజావేదిక నుండి జగన్‌ విధ్వంసం మొదలుపెట్టారని అన్నారు. తమ పొత్తు ప్రకటించిన రోజే తాము గెలిచామని, అప్పటి నుంచి వైసిపి కాడిపడేసిందని తెలిపారు. రౌడీయిజం, దొంగ ఓట్లు చేర్చి గెలవాలని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చూస్తున్నారని అన్నారు. అవినీతి డబ్బులతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఒక పక్క, రౌడీయిజం, అక్రమ సొమ్ము, ధనబలం, పెత్తందారులు ఉన్న వైసిపి మరోపక్క ఉందని చెప్పారు. ప్రజలే ముందుకు వచ్చి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పుడూ చేయని కసరత్తు చేశానని చెప్పారు. ప్రకటించిన 99 స్థానాల్లో 23 మందికి కొత్తగా అవకాశం కల్పించామని తెలిపారు.

ప్రయోగం చేయలేను : పవన్‌ కళ్యాణ్‌

తమ పార్టీ నుంచి ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేయడం కంటే తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కొంతమంది 45 కావాలి, 75 కావాలి అంటున్నారని చెప్పారు. 2019లో 10 స్థానాలు తమ పార్టీ గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడగడానికి అవకాశం ఉండేదని వారితో చెప్పానని తెలిపారు. అందుకే తక్కువ స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని, 24 స్థానాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే 21 అసెంబ్లీ స్థానాలు వాటిలో భాగమవుతాయని, వీటిని కూడా కలుపుకుంటే 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లే లెక్క అని చెప్పారు. టిడిపి-జనసేన పొత్తు బలంగా ఉండాలని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు టిడిపికి ఓటు వేయడం ఎంత ముఖ్యమో, టిడిపి ఓటు జనసేనకు వేయడం అంతే ముఖ్యమని చెప్పారు. వైసిపి పన్నాగాలు సృష్టిస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. వైసిపి విముక్త రాష్ట్రమే ప్రథమ అజెండా అని అన్నారు. వైఎస్‌ జగన్‌ సిద్ధమంటే తాము యుద్ధం చేస్తామని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటులో బిజెపిని కూడా దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కె అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, కె నాగబాబు పాల్గన్నారు.

జనసేన అభ్యర్థులు..

 • నెల్లిమర్ల- లోకం మాధవి
 • అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
 • రాజానగరం-  బత్తుల బలరామకృష్ణ
 • కాకినాడ రూరల్- పంతం నానాజీ
 • తెనాలి- నాదెండ్ల మనోహర్

టిడిపి అభ్యర్థుల జాబితా..

 • ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
 • టెక్కలి-అచ్చెన్నాయుడు
 • ఆమదాలవలస-కూన రవికుమార్‌
 • రాజాం-కోండ్రు మురళి
 • కురుపాం – తొయ్యక జగదీశ్వరి
 • పార్వతీపురం – విజయ్‌ బోనెల
 • సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
 • బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు(బేబీ నాయన)
 • గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్‌
 • విజయనగరం – అదితి గజపతిరాజు
 • విశాఖ ఈస్ట్‌ – వెలగపూడి రామకృష్ణబాబు
 • విశాఖ వెస్ట్‌ – పీజీవీఆర్‌ నాయుడు
 • అరకు – సియ్యారి దొన్ను దొర
 • పాయకరావుపేట – వంగలపూడి అనిత
 • నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు
 • తుని-యనమల దివ్య
 • పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
 • అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
 • ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
 • పి.గన్నవరం – రాజేశ్‌ కుమార్‌
 • కొత్తపేట – బండారు సత్యానంద రావు
 • మండపేట – జోగేశ్వరరావు
 • రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
 • జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
 • ఆచంట – పితాని సత్యనారాయణ
 • పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
 • ఉండి – మంతెన రామరాజు
 • తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
 • ఏలూరు – బాదెటి రాధాకృష్ణ
 • చింతలపూడి – సోంగ రోషన్‌
 • తిరువూరు – కొలికపూడి శ్రీనివాస్‌
 • నూజివీడు – కొలుసు పార్థసారథి
 • గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
 • గుడివాడ – వెనిగండ్ల రాము
 • పెడన – కాగిత కృష్ణ ప్రసాద్‌
 • మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
 • పామర్రు – వర్ల కుమార రాజ
 • విజయవాడ సెంట్రల్‌ – బొండ ఉమ
 • విజయవాడ ఈస్ట్‌ – గద్దె రామ్మోహన రావు
 • నందిగామ – తంగిరాల సౌమ్య
 • జగ్గయ్యపేట – శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
 • తాడికొండ – తెనాలి శ్రవణ్‌ కుమార్‌
 • మంగళగిరి – నారా లోకేశ్‌
 • పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

టిడిపి అభ్యర్థుల జాబితా..

 • వేమూరు(ఎస్సీ) – నక్కా ఆనంద్‌బాబు
 •  రేపల్లె – అనగాని సత్యప్రసాద్‌
 • బాపట్ల – వి.నరేంద్ర వర్మ
 • ప్రత్తిపాడు(ఎస్సీ) – బూర్ల రామాంజినేయులు
 • చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
 • సత్తెనపల్లి – కన్నా లక్ష్మినారాయణ
 • వినుకొండ – జీవీ ఆంజనేయులు
 • మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
 • యర్రగొండపాలెం (ఎస్సీ) – గూడూరి ఎరిక్సన్‌ బాబు
 • పర్చూరు – ఏలూరి సాంబశివరావు
 • అద్దంకి – గొట్టిపాటి రవికుమార్‌
 • సంతనూతలపాడు (ఎస్సీ) – బొమ్మాజి నిరంజన్‌
 • విజయ్‌కుమార్‌
 • ఒంగోలు – దామచర్ల జనార్దనరావు
 • కొండపి – డోలా బాల వీరాంజనేయస్వామి
 • కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
 • కావలి – కావ్య కృష్ణారెడ్డి
 • నెల్లూరు సిటీ – పి. నారాయణ
 • నెల్లూరు రూరల్‌ – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
 • గూడూరు (ఎస్సీ) – పాశం సునీల్‌కుమార్‌
 • సూళ్లూరుపేట (ఎస్సీ) – నెలవేల విజయశ్రీ
 • ఉదయగిరి – కాకర్ల సురేశ్‌
 • కడప – మాధవిరెడ్డి
 • రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
 • పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
 • మైదుకూరు – పుట్టా సుధాకర్‌ యాదవ్‌
 • ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
 • శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
 • కర్నూలు – టీజీ భరత్‌
 • పాణ్యం – గౌరు చరితా రెడ్డి
 • నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్‌
 • బనగానపల్లి – బీసీ జనార్దనరెడ్డి
 • డోన్‌ – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
 • పత్తికొండ – కేఈ శ్యాంబాబు
 • కోడుమూరు – బొగ్గుల దస్తగిరి
 • రాయదుర్గం – కాలవ శ్రీనివాసులు
 • ఉరవకొండ – కేశవ్‌
 • తాడిపత్రి – జేసీ అస్మిత్‌ రెడ్డి
 • శింగనమల (ఎస్సీ) – బండారు శ్రావణి శ్రీ
 • కల్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు
 • రాప్తాడు – పరిటాల సునీత
 • మడకశిర (ఎస్సీ) – ఎం.ఈ. సునీల్‌కుమార్‌
 • హిందూపురం – నందమూరి బాలకృష్ణ
 • పెనుకొండ – సవిత
 • తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
 • పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి
 • నగరి – గాలి భానుప్రకాశ్‌
 • గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డాక్టర్‌ వీఎం. థామస్‌
 • చిత్తూరు – గురజాల జగన్మోహన్‌
 • పలమనేరు – ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
 • కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

 

 

 

➡️