ఒంటిమిట్టలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

Apr 21,2024 15:45 #Annual Brahmotsavam, #Ontimita

ఒంటిమిట్ట : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం స్వామివారు మోహినీ అలంకారంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని కేరళ డ్రమ్స్‌, యాత్రిక బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. యాత్రికులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
అర్చకులు మాట్లాడుతూ భాగవతం ప్రకారం దేవతలు, రాక్షసులు అమఅతం కోసం క్షీరసాగరంలో కోరుకున్న అమఅతం లభిస్తుందని తెలిపారు. దానిని పంచుకోవడంలో ఇద్దరి మధ్య కలహం ఏర్పడిందని, ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమఅతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడని వివరించారు.
ఒంటిమిట్టలో సోమవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకఅష్ణ చైతన్య సంఘం గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ఆదివారం సమర్పించారు. మొత్తంతలంబ్రాలను ఆలయం వద్ద డిప్యూటీ ఈవో నటేష్‌ బాబు, అర్చకులు శ్రావణ్‌ కుమార్‌ సమక్షంలో అందించారు.

➡️