తెలంగాణ : బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) టెండర్లలో అవకతవకలు జరిగాయని, ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ ఆరోపించారు. ఈమేరకు ఏసీబీకి మాజీ మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఓఆర్‌ఆర్ టెండర్ ప్రక్రియపై విచారణ జరిపి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను ఏసీబీ గురువారం విచారించనున్న సంగతి తెలిసిందే.