బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

Sep 13,2024 07:53 #Bengal, #Low pressure

విశాఖపట్నం: రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. తర్వాతి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబరు మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

➡️