ఎపి అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య రాజీనామా

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. నియోజకవర్గంలో సీనియర్‌ నేత, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చెరుపుచెర్ల రఘురామయ్య సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కర్నూలు నగరంలోని హ్యాంగ్‌ అవుట్‌ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీలో చేరింది మొదలు నేటి వరకు తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. పార్టీలోకి తాను తీసుకువచ్చిన వారికి ఇచ్చిన గుర్తింపు, తనకు ఇవ్వడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పట్ల ఉన్న అభిమానంతో వైసిపిలో ఇన్నాళ్లు కొనసాగేనన్నారు. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి మాట మడమ తిప్పారన్నారు. అన్ని విధాలా ఎమ్మెల్యేగా అర్హతలు కలిగిన నా తన ప్రియతమా మిత్రుడు అయిన నందికొట్కూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అర్థర్‌కు సీటును కేటాయించకపోవడం తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని అన్నారు. ముఖ్యమంత్రిని నమ్ముకుని వెంట వచ్చిన దళితుల, బీసీల గొంతును కోశారన్నారు. అంబేద్కర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అంబేద్కర్‌ వాది కాలేడని అన్నారు. అవినీతి నిలయంగా పాలన మారిందన్నారు. రాష్ట్రంలో ఏ అధికారిని అడిగినా నిధులు లేవు అంటూ చేతులెత్తేస్తున్నారన్నారని.. మద్యపానాన్ని నిషేధిస్తానని మాట ఇచ్చినా ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. మధ్యమే ఆయనకు ఆయన కేడర్‌కు ఆదాయ వనరుగా మార్చుకున్నారన్నారు. ఏ చిన్న అంశానికైనా లెక్కలు ఉంటాయి కానీ మద్యానికి లెక్క, దిక్కు లేకుండా పోయిందన్నారు. కల్తీ మద్యంతో వేలాది జనుల ప్రాణాలు తీసేందుకు కారణమయ్యారన్నారు. ఈ నేపథ్యంలోని తాను వైసీపీని వెళుతున్నట్లు పేర్కొన్నారు త్వరలో తన కార్యకర్తలతో 6 మండలాల్లో వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే తన రాజకీయ కర్తవ్యాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు ఆయన అనుచరులు సుబ్బరాయుడు, సుధాకర్‌ రెడ్డి, మహేష్‌ నాయుడు తదితరులు ఉన్నారు.

➡️