డిప్యూటీ సిఎంగా పవన్ కల్యాణ్
ఆర్థికశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్
హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత
సమాచార శాఖకు కొలుసు పార్థసారధి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర మంత్రులకు శాఖలు ఖరారయ్చాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాఖల కేటాయింపు ప్రక్రియను శుక్రవారం పూర్తిచేశారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ జాబితాను విడుదల చేసింది. ముందునుండి ఊహిస్తున్నట్లుగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సిఎం హోదా కల్పించారు. దానితో పాటు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం తదితర శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు విద్య (హెచ్‌ఆర్‌డి), ఐటి, ఆర్‌టిజి శాఖలు కేటాయించారు. ఆర్థికశాఖను పయ్యావుల కేశవ్‌కు అప్పగించగా, వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. కొలుసు పార్ధసారధిని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా నియిమించారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో గట్టిగా నిలబడి పోరాడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చారన్చ అభిప్రాయం మంత్రవర్గంపై వినపడుతోంది. కొత్త, పాత, అనుభజ్ఞుల కలయికతో నూతన మంత్రివర్గం కొలువు తీరినట్టు చెబుతున్నారు. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారున్నారు. వారిలో కొంతమంది సీనియర్ శాసనసభ్యులు అయినప్పటికీ మంత్రులుగా ఎన్నికవడం ఇదే తొలిసారి. వీరిలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఒకరు. 25 ఏళ్లకుపైగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. అలాగే దుర్గేష్, నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణిలకు ఎమ్మెల్సీగా చట్టసభ అనుభవం ఉన్నా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెంటనే మంత్రులుగానూ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొత్తగా చట్టసభకు ఎన్నికైనా ఉపముఖ్యమంత్రి అయ్యారు. వంగలపూడి అనిత రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ముఖ్యమైన హోమ్‌మంత్రిత్వశాఖను అప్పగించారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున అవినీతి జరిగిన ఎక్సైజ్‌శాఖను కొల్లు రవీంద్రకు అప్పగించారు. ఆయన క 2014లో తొలిసారి గెలిచి మంత్రిపదవి చేపట్టారు. 2024లో రెండోసారి గెలిచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కొత్త మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. మిగిలిన వారిలో సీనియర్లపై కేసులు నమోదు చేశారు. వీరిలో పవన్ కల్యాణ్, పొంగూరు నారాయణను గత ప్రభుత్వం ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. కేసులు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చట్టసభలో గట్టిగా నిలబడిన వారిలో అచ్చెన్నాయుడుతోపాటు నిమ్మల రామానాయుడు, డోల బాలవీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాదు, గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. హోమ్‌శాఖ మంత్రి వంగలపూడి అనితను సోషల్ మీడియాలో విపరీతంగా వ్యక్తిగత ట్రోల్‌కు గురయ్యారు. గత ఎన్నికల్లో వైసిపి తరుపున గెలిచి ముఖ్యమంత్రి తీరుతో విసిగిపోయి చివర్లో వైసిపిని వీడిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి టిడిపిలో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారికీ మంత్రి పదవులు దక్కాయి. .
మంత్రులు వారికి కేటాయించిన శాఖలు
1 నారాచంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, లా అం్డ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ఇతరులకు కేటాయించబడని శాఖలు.
2. కొణిదెల పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
3 నారా లోకేష్ మావన వనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్‌టిజి
4 కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్థక, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖ
5 కొల్లు రవీంద్ర మైనింగ్, జియాలజీ, ఎక్సైజ్
6. నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
7 పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి
8 వంగలపూడి అనిత హోం, ప్రకృతి విపత్తులు
9 సత్యకుమార్‌యాదవ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య
10 నిమ్మల రామానాయుడు జలవనరుల విభాగం
11 నశ్యం మహ్మద్ ఫరూఖ్ లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమం
12 ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ
13 పయ్యావుల కేశవ్ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, శాసనసభా వ్యవహారాలు
14 అనగాని సత్యప్రసాదు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు
15 కొలుసు పార్థసారథి హౌసింగ్, సమాచార పౌర సంబంధాలు
16 డోల శ్రీబాలవీరాంజనేయస్వామి సాంఘిక సంక్షేమ, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, సచివాలయాలు, వలంటీర్లు
17 గొట్టిపాటి రవికుమార్ విద్యుత్
18 కందుల దుర్గేష్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
19 గుమ్మడి సంధ్యారాణి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
20 బి.సి.జనార్థనరెడ్డి రోడ్లు భవనాలు, సదుపాయాలు, పెట్టుబడులు
21. టి.జి.భరత్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
22 ఎస్.సవిత బిసి సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం, హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్
23 వాసంశెట్టి సుభాష్ లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
24 కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్‌ఎంఇ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్ మరియు సంబంధాలు
25 మండిపల్లి రాంప్రసాదరెడ్డి రవాణా, యూత్ అండ్ స్పోర్ట్స్