కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల

– 5, పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు
అభ్యర్థులను ప్రకటించిన వైఎస్‌ షర్మిల
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎఐసిసి ఆదేశాల మేరకు ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మంగళవారం ఇడుపులపాయలో ఈ జాబితాను విడుదల చేశారు. ఈ తొలి జాబితాలో 5 పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలకు సంబంధించి త్వరలో మరో జాబితా విడుదల చేసేందుకు ఎఐసిసి, ఎపిసిసి సన్నాహాలు చేస్తున్నాయి. కాగా, తొలి జాబితాలో కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ షర్మిల ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. ఎంఎం పల్లంరాజు కాకినాడ నుంచి, గిడుగు రుద్రరాజు రాజమండ్రి నుంచి, జేడి శీలం బాపట్ల నుంచి, పిజి రామ్‌పుల్లయ్య యాదవ్‌ కర్నూలు నుంచి ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.
ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా:
కడప – వైఎస్‌ షర్మిల
కర్నూలు – రాంపుల్లయ్య యాదవ్‌
రాజమండ్రి – గిడుగు రుద్రరాజు
బాపట్ల – ఎంపీ జేడీ శీలం
కాకినాడ – పల్లంరాజు.

114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు

1.jpg

2.jpg

3.jpg

4.jpg

5.jpg

6.jpg

➡️