- ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బుధవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజలి దర్శించుకున్నారు. ‘వారాహి’ డిక్లరేషన్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్ష విరమించారు. ఆలయం వెలుపల వారాహి డిక్లరేషన్ ప్రతులను మీడియాకు చూపించారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో యాత్రికులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. క్రైస్తవాన్ని స్వీకరించిన చిన్న కుమార్తె పొలెనా అంజలితో ఆలయ నియమాలను అనుసరించి డిక్లరేషన్ ఇప్పించారు. గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. ఆయన వెంట శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, తిరుపతి రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.