త్వరలో AP EAMCET 2025 నోటిఫికేషన్‌..

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు ఏపీ ఎంసెట్  2025 నోటిఫికేషన్‌ను జేఎన్టీయూ కాకినాడ విడుదల చేసింది. ఎంసెట్ కు సంబంధించిన దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి మొదలు కానుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్‌ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలతో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సులకు ఆన్లైన్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా ఎంసెట్ ను నిర్వహిస్తారు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు.. మే 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరుగుతాయి. అప్లికేషన్‌ ఫీజు ఇతర విషయాలు తెలుసుకోవడానికి ఈ లింక్‌పై cets.apsche.ap.gov.in క్లిక్‌ చేయండి.

➡️