రైతు మురళికి ఏపీ రైతు సంఘం పరామర్శ

Mar 13,2025 13:14 #ap raithu sangam, #farmers, #suside

ప్రజాశక్తి-అనంతపురం : నాసిరకం విత్తనాలుతో నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు మురళిని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఎస్‌ఎఫ్‌ మ్యాక్స్‌ కంపెనీకి చెందిన నాసిరకం కల్తీ కలింగర విత్తనాలు అమ్మిన శ్రావణి సీడ్స్‌ షాప్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ శాఖ అనంతపురం డివిజన్‌ ఏడీఏ రవి తక్షణ చర్యలు తీసుకుకోవాలని కోరారు. రైతు మురళికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

➡️