- 1,136 ఎస్జిటి, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
- డిఎస్సితో పోస్టుల భర్తీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టుల్లో ఎస్‌జిటి పోస్టులు 1,136 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,124 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులు పోస్టులైన 860ని కూడా ఈ కేటగిరిలోకి తీసుకువచ్చారు. జిల్లా ఎంపిక కమిటీ (డిఎస్సి)తో ఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటిజం సహా మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు విద్యను బోధించేందుకు ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ను ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
జిల్లాల వారీగా మంజూరు చేసిన పోస్టుల వివరాలు