AP Group-2 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రూప్‌-2 ప్రధాన పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) అధికారులు విడుదల చేశారు. 79,451 మంది పరీక్ష రాయగా, 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు 2,168 మందిని ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు. 899 ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించగా, ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలను వ్యక్తిగతంగా తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, గ్రూప్‌-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్‌ పాయింట్ల అంశంపై హైకోర్టు లో కేసు పెండింగ్‌లో ఉండటంతో తుది తీర్పున కు లోబడి నియామక ప్రక్రియ చేయపట్టను న్నట్లు కమిషన్‌ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్‌ పరీక్ష ఫైనల్‌ కీని కూడా వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఫలితాల కోసం… https://portal-psc.ap.gov.in/

అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌ సైట్లోకి వెళ్లాలి.
ఏపీ గ్రూప్‌ 2 రిజల్ట్స్‌ లింక్‌ పై క్లిక్‌ చేయాలి.
ఇక్కడ రిజల్ట్స్‌ నోటిఫికేషన్‌ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేస్తే పీడీఎఫ్‌ ఓపెన్‌ అవుతుంది.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌ టికెట్‌ నెంబర్లు ఉంటాయి.
ప్రింట్‌ లేదా డౌన్లోడ్‌ ఆప్షన్‌ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఫైనల్ కీ కోసం … https://portal-psc.ap.gov.in/HomePages/KeysToPapers

 

➡️