AP Inter Board – వరదలో సర్టిఫికెట్లు పోయాయా ? ఉచితంగా సర్టిఫికెట్లను ఇస్తాం : ఏపీ ఇంటర్‌ బోర్డు

అమరావతి : ఇటీవల ఏపీలో వరదల విపత్తు సంభవించిన వేళ … చాలామంది విద్యార్థులు తమ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లను కోల్పోయారు. ఏపీలోని పలు జిల్లాల్లో వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన అందరికీ ఉచితంగా సర్టిఫైడ్‌ కాపీలు, డూప్లికేట్‌ సర్టిఫికెట్లను అందించాలని ఇంటర్‌ విద్యామండలి నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంటర్‌ విద్య కార్యదర్శి కృతికా శుక్లా ఓ ప్రకటనలో వెల్లడించారు. దీని గుర్చిన సమాచారాన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఐవోలు, డీఐఈవోలు ముమ్మరంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు సర్టిఫికెట్ల కాపీల కోసం వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్‌, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను సంప్రదించాలని సూచించారు.

➡️