హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ, కసిరెడ్డి స్పందించలేదని, విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఆయన కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
