AP TET 2024 – నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి : నేటి నుండి ఓపెన్‌ కానున్న వెబ్‌ సైట్‌ ఎపి రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మెగా డీఎస్సీ నిర్వహించే ముందే మరోసారి టెట్‌ నిర్వహణకు ఎపి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూలై 2 నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఎపిలో 16 వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్‌సి నిర్వహించనున్న సమయంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆగస్టు 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 25న తుది కీ విడుదల చేసి.. 30న టెట్‌ ఫలితాలను ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. మరోవైపు … మెగా డిఎస్‌సికి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డిఎస్‌సిలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌, ఇన్‌ఫర్మేషన్‌ బులిటెన్‌, షెడ్యూల్‌, సిలబస్‌తోపాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

➡️