గణేష్‌ నిమజ్జనంలో అపశృతి

 30 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిది : నెల్లూరు జిల్లా మనుగోలు మండల కేంద్రంలో గణేష్‌ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి బిసి కాలనీలో గణేష్‌ విగ్రహం నిమజ్జన సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్బంలో బాణసంచా కాల్చారు. వీటి నిప్పురవ్వలు నిల్వ ఉంచిన బాణసంచాపై పడ్డాయి. దీంతో, బాణసంచా మొత్తం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. నిప్పురవ్వలు ఎగిసి పడడంతో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉనుట్లు సమాచారం. బాధితులను తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️