ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్ హెరాల్డ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీపై ఇడి చార్జ్‌షీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే బిజెపికి భయం పట్టుకుందని, దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సిబిఐ, ఇడిలను తన సొంత ఏజెన్సీలుగా వాడుకుంటుందన్నారు. మనీతో సంబంధం లేని కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపించడం అత్యంత దారుణమన్నారు. బిజెపిపైనే ప్రజలు చార్జ్‌షీటు వేసే సమయం దగ్గరపడిందని తెలిపారు. అదాని వంటి వాళ్లకు దేశాన్ని ఎలా దోచి పెడుతున్నారో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు.
