కె.రామకృష్ణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సహకార రంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎపిసిసిబిఇఎ) కృషి మరువలేనిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అసోసియేషన్ వజ్రోత్సవ కమిటీ ఛైర్మన్ కె.రామకృష్ణ అన్నారు. అసోసియేషన్ 59 ఏళ్ల ప్రస్థానం, ఉద్యమం చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఎపిసిసిబిఇఎ వజ్రోత్సవాల లోగో, పోస్టర్‌ను అసోసియేషన్ నేతలతో కలిసి రామకృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉద్యోగుల హక్కుల రక్షణ, గ్రామీణ వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా అసోసియేషన్ పని చేస్తూ 60 ఏళ్లలోకి ప్రవేశించడం గర్వించదగిన విషయమని చెప్పారు. వజ్రోత్సవాలకు ఏఐబిఇఎ జాతీయ నాయకులు వెంకటాచలం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, తదితర ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిఎస్ రవికుమార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 13, 14వ తేదల్లో విజయవాడలోని ఎంబివికెలో అసోసియేషన్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
