సకాలంలో అర్జీలు పరిష్కరించాలి

  • 2047 నాటికి 15 శాతం వృద్ధి రేటు
  • సిఎస్‌ విజయానంద్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, ఆర్థికేతర ఫిర్యాదులు, అర్జీలను వెంటనే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల హెచ్‌ఒడిలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశించారు. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో కలెక్లర్ల సదస్సు నిర్వహించే అవకాశం ఉందన్నారు. కులగణన, జిఎస్‌డి, సోషల్‌ ఆడిట్‌, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై కార్యదర్శులు ద్వారా కలెక్టర్లకు పూర్తి అవగాహన కలిగించడంపై సచివాలయంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ.. ప్రజల అర్జీలు, ఫిర్యాదులను నిర్ధిష్ట వ్యవధిలోగా హేతుబద్ధంగా పరిష్కరిం చాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారా నికి సంబంధించి ప్రతి శాఖ తరపున ఒక నోడల్‌ అధికారిని నియమించాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు మరింత సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. శాఖల వారీ ప్రణాళికలు, సెక్టార్ల వారీ, జిల్లాల వారీ డేటాను సిద్ధం చేశామని, దానిని కార్యదర్శులు, కలెక్టర్లకు పంపుతామన్నారు. ఎస్‌సి కేటగిరైజేషన్‌పై ఏకసభ్య కమిషన్‌కు ఈ నెల 27లోగా వివరాలు అందించాల న్నారు. ఈ సమావేశంలో సిసిఎల్‌ఎ జి జయలక్ష్మి, సిఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ఎం ఎయుడి ముఖ్యకార్యదర్శి ఎస్‌ సురేష్‌కుమార్‌, కార్యదర్శులు కన్నబాబు, ఎంఎం నాయక్‌, సిడిఎంఎ హరినారాయణ, ఆర్‌టిజిఎస్‌ సిఇఒ దినేష్‌కుమార్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ లావణ్య వేణి పాల్గొన్నారు.

➡️