ఎమ్మెల్సీ ఎన్నికలకు సమన్వయకర్తలను నియమించిన జనసేన

Feb 14,2025 17:33 #JanaSena, #mlc elections

మంగళగిరి : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ క్రమంలో ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి జనసేన తరపున పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనను విడుదల చేశారు.

పార్లమెంట్ నియోజక వర్గాలు – జనసేన సమన్వయకర్తలు:
* కాకినాడ – తుమ్మల రామస్వామి
* రాజమండ్రి – యర్నాగుల శ్రీనివాస రావు
* అమలాపురం – బండారు శ్రీనివాసరావు
* నరసాపురం – చన్నమల్ల చంద్ర శేఖర్
* ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు
* విజయవాడ – అమ్మిశెట్టి వాసు
* మచిలీపట్నం – బండి రామకృష్ణ
* గుంటూరు – నయబ్ కమల్
* నరసరావుపేట – వడ్రాణం మార్కండేయ బాబు

➡️