ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన సభ సభ్యులతో ఐదు కమిటీలను సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. ఇందుకు సంబంధించిన వివరాలు అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీలను ఏడాది కాలానికి నియమించినట్లు వెల్లడించారు. నియమాల కమిటీ కమిటీకి ఛైర్మన్‌గా, సభాపతి అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తారని, సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, పత్సామల ధర్మారాజు, గద్దె రామమోహన్, కిమిడి కళా వెంకట్రావు, యలమంచిలి సత్యనారాయణలు ఉన్నారు. ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్‌గా ఉప సభాపతి కె రాఘురామ కృష్ణరాజు వ్యవహరిస్తారు, సభ్యులుగా గంటా శ్రీనివాసరావు, గురజాల జగన్‌మోహన్, కొణతాల రామకృష్ణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పల్లా శ్రీనివాసరావు, పెనుమత్స విష్ణుకుమార్ రాజులు ఉన్నారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్, సభ్యులుగా బత్తుల బలరామకృష్ణ, బాష్యం ప్రవీణ్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, ముప్పిడి వెంకట్రావులు ఉన్నారు. ప్రవిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా పితాని సత్యనారాయణ, సభ్యులుగా పుసపాటి అదితి విజయలక్ష్మీ, బండారు సత్యనారాయణరావు, బొగ్గుల దస్తగిరి, పత్సామల ధర్మరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మామిడి గోవిందరావులు ఉన్నారు. ప్రభుత్వ హామీలు కమిటీ ఛైర్మన్‌గా కామినేని శ్రీనివాస్, సభ్యులుగా అమిలినేని సురేంద్రబాబు, దామచర్ల జనార్ధనరావు, గిడ్డి సత్యనారాయణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నంద్యాల వరదరాజుల రెడ్డి, కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు ఉన్నారు.
