ప్రభుత్వ న్యాయవాదుల నియామకం

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ కేసుల్ని హైకోర్టులో వాదించే నిమిత్తం ఒక ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది, ఇద్దరు ప్రభుత్వ న్యాయవాదులు, 11 మంది అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్లను మంగళవారం నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. న్యాయశాఖ కార్యదర్శి వి సునీత పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. దొడ్డల యతీంద్ర దేవ్‌ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కొచ్చర్లకోట రామలింగేశ్వరరావు, ఆర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి ప్రభుత్వ ప్లీడర్లుగా నియమితులయ్యారు. ఆకుమర్తి పుష్పలీల, రెడ్డి మైత్రేయి, కె శివ జ్యోతి, పంచాడి అఖిల నాయుడు, యర్రంశెట్టి హరి స్వప్న, రత్న ముదావతు, ఉయ్యూరు రామ్‌ మనోహర్‌, తాడిశెట్టి వెంకట ఆనందరావు, సోమరాజు పట్టిం, పత్సవ లలితాదిత్య, చక్కిలం స్వప్నప్రియ ప్రభుత్వ సహాయ న్యాయవాదులుగా నియమితులయ్యారు.

➡️