మరో 4 జిల్లాలకు వైసిపి అధ్యక్షుల నియామకం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని మరో నాలుగు జిల్లాలకు వైసిపి నూతన జిల్లా అధ్యక్షులను నియమించింది. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్‌ నియమితులయ్యారు. అలాగే అనకాపల్లి జిల్లాకు మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, బాపట్ల జిల్లాకు మాజీ మంత్రి మేరుగ నాగార్జున నియమితులయ్యారు. అలాగే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ ఎంపి నందిగం సురేష్‌బాబు, వైసిపి పిఎసి మెంబర్‌గా ఆదిమూలపు సురేష్‌, విశాఖపట్నం వెస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మళ్లా విజయప్రసాద్‌, రాష్ట్ర ఎస్‌టి విభాగం అధ్యక్షులు, పార్టీ పిఎసి సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

➡️