ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వైసిపి నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు వైసిపి వైసిపి కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లాకు జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లాకు శత్రుచర్ల పరీక్షిత్‌రాజులను నియమించారు. అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
