అమరావతి : ‘ మిచౌంగ్ ‘ తుఫాను ముంచుకొస్తోన్న వేళ … ఎపి వాతావరణ శాఖ రాష్ట్రంలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను, మరో 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. నెల్లూరు, కడప, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
