రియల్‌ ఎస్టేట్‌ ట్రిబ్యునల్‌లో 14 పోస్టులకు ఆమోదం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో 14 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి కన్నబాబు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంజూరైన 14 పోస్టుల్లో 13 కాంట్రాక్టు పద్ధతిలోనూ, ఒకటి అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలోనూ నియమించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రార్‌, కోర్టు ఆఫీసర్‌, ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ స్టెనో, రికార్డు అసిస్టెంట్‌, ఆఫీసు సబార్డినేట్‌ నియామకాలకు ఆమోదం తెలిపారు. 2017 రియల్‌ ఎస్టేట్‌ రూల్స్‌ ప్రకారం ఎపి రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

➡️