ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) 8 విభాగాల పోస్టులకు పరీక్షల తేదీలను ప్రకటించింది. 8 విభాగాలు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కామన్‌గా ఉండే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (జిఎస్‌ఎంఎ) పేపర్‌ను ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనుంది. సబ్జెక్టు పేపర్ పరీక్షలను వివిధ తేదీల్లో నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎపిపిఎస్‌సి కార్యదర్శి ఐ నరసింహామూర్తి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మొదటి సెషన్(ఎఫ్‌ఎన్)లో నిర్వహించే పరీక్షను ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెక్షన్(ఎన్)లో నిర్వహించే పరీక్షను మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రంలో విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు.
- ఏప్రిల్ 28 -30 -2025 : అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ ఉద్యోగాలు.
- ఏప్రిల్ 28 -30-2025 : లైబ్రేరియన్, మెడిక్ అండ్ హెల్త్ సబ్ అర్డినేట్ సర్వీస్.
- ఏప్రిల్ 28 -30-2025 : అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్.
- ఏప్రిల్ 28 -30 -2025 : అసిస్టెంట్ డైరెక్టర్, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ.
- ఏప్రిల్ 28 – 30 -2025 : అసిస్టెంట్ కెమిస్ట్ – గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్.
- ఏప్రిల్ 28 -30-2025 : అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్.
- ఏప్రిల్ 28 -30-2025 : అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్.
- ఏప్రిల్ 28 -30 -2025 : ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్