పిడిఎఫ్‌ అభ్యర్థి గోపిమూర్తికి ఎపిటిఎఫ్‌ మద్దతు

Nov 11,2024 00:09 #aptf, #Gopimurthy, #PDF candidate, #support

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ పిడిఎఫ్‌ అభ్యర్థి బి గోపిమూర్తికి ఎపిటిఎఫ్‌ మద్దతు తెలిపింది. ఆ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. ఫెడరేషన్‌ అధ్యక్షులు జి హృదయరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉభయ గోదావరి జిల్లా శాసనమండలి నియోజకవర్గ ఉపాధ్యాయ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న పిడిఎఫ్‌ అభ్యర్థి బి గోపిమూర్తికి మద్దతు ఇస్తూ తీర్మానం చేసింది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల ఏ విధాంగానూ స్పందించని పరిస్థితి నెలకొందని అసంతృప్తి వ్యక్తం చేసింది. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి నోటీస్‌ అందించి డిసెంబర్‌ 16, 17 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, జనవరిలో రాష్ట్రస్థాయి ధర్నాలు నిర్వహించాలని తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌ చిరంజీవిరావు, గౌరవాధ్యక్షులు ఎ సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.

➡️