తుంగభద్రాలో జల కళ కళ

Jun 9,2024 17:44 #flood water, #tungabadra

ప్రజాశక్తి-కౌతాళం(కర్నూలు) : చాలా రోజుల తర్వాత తుంగభద్ర నది లో జలాలు కళకళలాడుతున్నాయి. మొన్నటివరకు ఎడారిలో తలపిస్తున్న తుంగ భద్ర నది నేడు వర్షపు నీటితో ప్రవహిస్తున్నది. ఆంధ్ర సరిహద్దు కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేలగనూరు గ్రామం వద్ద నుండి ప్రవహిస్తున్నది. కర్ణాటకలోని బళ్లారి సిరుగుప్ప, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు తుంగభద్ర నదికి చేరుకుంటున్నాయి. తుంగభద్ర నది నీటితో ప్రవహిస్తుండటంతో నది తీర గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం ఉంటే నది తీర గ్రామాలైన మెలిగ నూర్, నది చాగి కుంభలనూర్, మురళి, గుడి కంబాలి, వల్లూరు నది తీర గ్రామ రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయంతో పాటు అనేక గ్రామాలకు తాగునీరు అందుతున్నాయి. సుమారు 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు తెలుస్తుంది.

➡️