అక్రమ అరెస్టులు దారుణం

asha workers protest state wide

– ఆశాలపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలి

– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

– రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ

ప్రజాశక్తి-యంత్రాంగం: ‘చలో విజయవాడ’ సందర్భంగా పోలీసుల అక్రమ అరెస్టులు, నిర్బంధాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు శుక్రవారం విధులు బహిష్కరించి ధర్నాలు, ఆందోళనలు చేశారు. కనీస వేతనం అమలు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, పని ఒత్తిడి తగ్గించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలని చూడకుండా పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించారని అన్నారు. ‘చలో విజయవాడ’కు వెళ్లిన వారిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో పిహెచ్‌సిలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఏలూరులోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లు, పిహెచ్‌సిలతోపాటు చాట్రాయిలో ర్యాలీ, బయ్యన్నగూడెంలో రాస్తారోకో చేపట్టారు. బుట్టాయగూడెంలో రాస్తారోకో చేపట్టి అనంతరం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మానవహారం చేపట్టారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జిల్లాల్లోని తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాలకు సిపిఎం, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. విశాఖలోని జగదాంబ సెంటర్‌ వద్ద ధర్నా, గాజువాక, భీమిలిలో ర్యాలీలు, మానవహారాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, అల్లూరి జిల్లా పాడేరు, రంపచోడవరం డివిజన్లలో నిరసనలు తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ర్యాలీ చేపట్టారు. ఆశావర్కర్లపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు టవర్‌ క్లాక్‌ సెంటర్‌ నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. సూళ్లూరుపేటలో సిఐటియు కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట, టిపిగూడూరు, కావలిరూరల్‌లో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ధర్నాలు చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిరసన, ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిరసన ర్యాలీ, వెలిగండ్లలో రాస్తారోకో చేశారు. గుంటూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో ఆందోళనలు చేశారు.

 

 అక్రమంగా అరెస్టు చేసిన ఆశా, యూనియన్ నాయకులను విడుదల చేయాలి 

తిరుపతి జిల్లా – గూడూరు : తిరుపతి జిల్లా గూడూరులో శుక్రవారం రోజు రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపుమేరకు ఆశ వర్కర్ల సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆశా వర్కర్లను సి.ఐ.టి.యు నాయకత్వాన్ని అన్యాయంగా అక్రమంగా పోలీసులు అరెస్టులు, నిర్బంధాన్ని, అక్రమంగా అరెస్టు చేసిన, “ఆశా వర్కర్ల నాయకులను వెంటనే విడుదల చేయాలని”, ప్రభుత్వం మొండి వైకిరిని నిరసిస్తూ తిరుపతి జిల్లా గూడూరులో టవర్ క్లాక్ సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి ఆర్డిఓ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

asha workers protest in alluri

అల్లూరి జిల్లా – రాజవొమ్మంగి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జంక్షన్ వద్ద రహదారిపై శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యంలో మండల ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. తొలిత స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి అల్లూరు జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అల్లూరి జంక్షన్ వద్ద రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దగ్గరగా నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ అమ్మిరాజు, కె చంద్రావతి, లక్ష్మి శ్రీ, ప్రజా సంఘాల నాయకులు టి శ్రీను, ఆశా వర్కర్ల యూనియన్ మండల నాయకులు, కె చంద్రావతి, కె బాలమ్మ, లక్ష్మి శ్రీ, సీత,భవాని, నూకరత్నం, చెల్లయమ్మ, దుర్గ, సూర్యావతి, ఈ సత్యవతి, పెద్ద సంఖ్యల ఆశ వర్కర్ల పాల్గొన్నారు.

asha workers protest in tpt

తిరుపతి జిల్లా – సూళ్లూరుపేట : ఆశ వర్కర్లు నిరసన ర్యాలీని సూళ్లూరుపేట సిఐటియు కార్యాలయం నుండి బస్టాండ్ వరకు శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆశా వర్కర్లు కనీస వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్‌వర్కర్స్‌ని ఆశాలుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు, వెటర్నటీ లీవులు అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, మరణించిన వారికి ఖర్చులు చెల్లించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని 62 సంవత్సరాలకు రిటైర్‌మెంట్‌ వర్తింప చేయాలని, మరణించిన, రిటైర్‌ అయిన కుటుంబాల్లో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమపథకాలు అమలు చేయాలని, కొవిడ్‌ కాలంలో మరణించిన ఆశాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఏఎన్‌ఎం శిక్షణ ఇవ్వాలని, ఖాళీపోస్టులు భర్తీ చేయాలని గురువారం తలపెట్టిన మహాధర్నాని ప్రభుత్వము అనేక ఆంక్షలు విధించి నాయకురాళ్ళను గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేసి చేశారు. ఈ అరాచకాన్ని నిరసిస్తూ దొరవారిసత్రం తడ సూళ్లూరుపేట మండల ఆశా కార్మికులు సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇచ్చి, నిర్బంధాలను ఖండించారు.

asha workers protest in nlr

నెల్లూరు జిల్లా – టిపి గూడూరు మండలం : ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో విజయవాడ (ఫిబ్రవరి 8)కార్యక్రమంలో పోలీసుల ఆశ వర్కర్ల మీద దురుసు ప్రవర్తనకు అరెస్టులకు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ మండల ఎమ్మార్వో ఆఫీస్ ముందు నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేస్తున్న టిపి గూడూరు మండల వరిగొండ, కోడూరు పీహెచ్ ల ఆశా వర్కర్స్ మరియు మండల సిఐటియు నాయకులు.

asha workers protest in krnl

ఆశావర్కర్లు సమస్యలను పరిష్కరించాలి

కర్నూల్ జిల్లా-ఆదోనిరూరల్ : పట్టణంలో స్థానిక శ్రీనివాస్ భవన్ సర్కిల్లో,ఆశ వర్కర్ల అక్రమ అరెస్ట్ నిరసనగా ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమాన్ని సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8వ తేదీన ఆశ వర్కర్ల తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకొంటూ,పలువురిని గృహ నిర్బంధంలో ఉంచడం,రైల్వే స్టేషన్లో అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని ఆశ వర్కర్లు ఆందోళనకు చేపట్టారు.కనీస వేతనం,సెలవులు,వేతనంతో కూడిన మేటర్నిటీ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్ష్యాలు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.గురువారం తలపెట్టిన ధర్నాను నిర్వహించకుండా వందలాది ఆశ కార్యకర్తలను,సిఐటియు నాయకులను అరెస్టు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం సరైంది కాదని అన్నారు.ఆశ వర్కర్ల యూనియన్ పట్టణ,మండల నాయకురాలు చిట్టెమ్మ,ఇందిరమ్మ, జయలక్ష్మి, రాజేశ్వరి, సరోజ,నాగలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దశలవా దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు.

asha workers protest in ntr

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు

asha workers protest in wg

కనీస వేతనం కోరుతూ ఆచంటలో ఆశాల ధర్నా
పశ్చిమగోదావరి జిల్లా – ఆచంట : ఆశా వర్కర్లకు కనీస వేతనం సెలవలు మెటర్నటీ లివ్ లు  రిటైర్మెంట్ బెనిఫిట్స్, పని భారం తగ్గించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా  ఆచంట మండలం ఆచంట వేమవరం, వల్లూరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద  సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం  ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  సిఐటియు మండల కార్యదర్శి  వర్దిపర్తి అంజిబాబు మాట్లాడుతూ ఆశా కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆశా కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు  కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కారం కోసం వెళుతుంటే ఆశాలను నాయకులను అరెస్టు లు చేయడం   ఆ ప్రజాస్వామ్యక చర్య అన్నారు. ఆశాల సమస్యలు పరిష్కరించకపోతే  రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల మండల కార్యదర్శి నక్క శైలజ, కార్యకర్తలు నెక్కంటి కనకదుర్గ, గంగాభవాని, మీనా కుమారి, డి సత్యవతి, లక్ష్మీ కుమారి, విజయలక్ష్మి, భవాని, సూర్యకుమారి, కృప, వీర వేణి , తదితరులు పాల్గొన్నారు.

asha workers protest in akp

అధికార వైసిపికి కోమ్ముకాస్తున్న పోలీసులు 

అనకాపల్లి జిల్లా – దేవరాపల్లి : ఐదేళ్లుగా ఆశాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న జగన్ మోహన్ రెడ్డి అశావర్క్ ర్లు సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు అధికార వైసిపికి కోమ్ము కాస్తున్నారని తెలిపారు,ఆశాలకు రూ.10 వేలు వేతనం ఇస్తానని ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసిన జగన్ హామీని ఎందుకు నిల బెట్టు కోలేదని ప్రశ్నించారు. వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కనీస వేతనం అమలు చేయాలని అర్హులైన ఆశాలకు, ANM లు ప్రమోషన్లు ఇవ్వాలని, నవరత్నాల్లో ఆశాలకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హమిలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పార్వతి కమల వరలక్ష్మి రమణమ్మ చిన్నమ్మలు తో పాటు అదికసంఖ్యలో అశావర్క్ ర్లు పల్గోన్నారు.

నిరంకుశ పాలనకు నిదర్శనమే ఆశా వర్కర్ల పై లాఠీ చార్జ్

విశాఖ జిల్లా – చీడికాడ : ఆశావర్కర్లపై ప్రభుత్వ లాఠీ చార్జీ నిరంకుశ పాలనకు నిదర్శనమని సిఐటియు మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు మద్దతు తెలిపి మాట్లాడారు, చీడికాడ అశావర్క్ ర్లు మండల కమిటీ అద్వర్యంలో విజయవాడలో అశావర్క్ ర్లు పై లాఠీ చార్జీ చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం చీడికాడ రామాలయం జంక్షన్ లో అశావర్క్ ర్లు రాస్తారోకో నిర్వహించి అనంతరం వారు మాట్లాడారు డిమాండ్లు పరిష్కారం కోసం చలో విజయవాడ చేపాట్టిన ఆశా వర్కర్ల పై పోలీసులులాఠీ చార్జ్ చేయడం జగన్ నియంతృత్వ పాలనకు పరాకాష్ట మని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కామాక్షి .రూప. సత్యవతి. కొండమ్మ. మల్లేశ్వరి. చిన్నమ్మలు. దేవి. తో పాటు అదికసంఖ్యలో అశావర్క్ ర్లు పల్గోన్నారు

asha workers protest in bapatla

కారంచేడులో తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన ఆశా వర్కర్లు
బాపట్ల జిల్లా – కారంచేడు : ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ప్రమోషన్లు కల్పించాలని శుక్రవారం నాడు తాసిల్దార్ మెహర్ బాబుకు వినతి పత్రం ఇచ్చారు.కారంచేడు మండల కార్యాలయం వద్ద ఆశాలు కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని , ఏఎన్ఎం, జిఎన్ఎమ్ ప్రమోషన్ ఇచ్చి ఆషాలను ప్రమోట్ చేయాలని అలాగే చట్టబద్ధమైన సెలవులు, జీతంతో ఇవ్వాలని కారంచేడు తాసిల్దార్ కు కారంచేడు మండలం ఆశ వర్కర్లు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంగమ్మ ,బేబీ రాణి ,రాధా ,సిఐటియు జిల్లా నాయకులు పి కొండయ్య తదితరులు ఉన్నారు.

asha workers protest in kkd

కాకినాడ జిల్లా – జగ్గంపేట : మండల కేంద్రమైన జగ్గంపేటలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం అవరణలో శుక్రవారం ఆశా వర్కర్లు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు సిహెచ్ మంగ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశా వర్కర్స్ ను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆశా వర్కర్స్ కనీస వేతనం చెల్లించాలని, సిహెచ్ సి వర్కర్స్ ను ఆశాలుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవు లు, మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ అమలు చేయాలని , ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ గురువారం చలో విజయవాడకు పిలుపు ఇవ్వడం జరిగిందని అక్కడకు వెళ్లనివ్వకుండా గృహ నిర్భందాలు చేశారనీ వారు ఆరోపించారు. తొలుత తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

asha workers protest in mandapeta

కోనసీమ జిల్లా – మండపేట : ఆశా కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం భగ్నం చేసిన పోలీసులు తమ నాయకులను ఎక్కడ దాచారో తెలపాలంటూ మండపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
విధి నిర్వహణలో ఉన్న ఆశా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు.

 

ఆశా  వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ నిరసన 
అనకాపల్లి జిల్లా – కశింకోట  : తమ సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రికి నివేదించుకుందామని వెళ్తున్న ఆశా కార్యకర్తలను ఎక్కడకక్కడ అరెస్టు చేసి, గృహ నిర్బంధాలు చేసి, పోలీసుల చేత నాయకులను, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొని వెళ్లి బంధించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం కసింకోట , తాళ్లపాలెం పి. హెచ్. సి.  పరిధిలోని ఆశ కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని, పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ., ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ స్కీములు వర్తింపజేయాలని, అర్హులైన ఆశా కార్యకర్తలకు పదోన్నతులు వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జాబ్ చార్ట్ ఇవ్వాలని, కక్ష సాధింపు చర్యలు అరికట్టాలని, తదితర డిమాండ్లు ప్రభుత్వం స్పందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే. శాంతి, తాళ్లపాలెం, కసింకోట పి.హెచ్. సి  ఆశా సంఘం. అధ్యక్ష ,కార్యదర్శులు కె. నూక రత్నం, భార్గవి ,రమణమ్మ,  ఈశ్వరమ్మ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నాయకురాలు డి.డి .వరలక్ష్మి మరియు మండలంలోని ఆశ కార్యకర్తలందరూ పాల్గొన్నారు.

asha workers protest in k gangavaram

కోనసీమ జిల్లా-రామచంద్రపురం : ఆశా వర్కర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం భగ్నం చేసిన పోలీసులు తమ నాయకులను ఎక్కడ దాచారో తెలపాలంటూ కే గంగవరం మండలంలోని ఆశా వర్కర్ లు శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో ఉన్న ఆశ వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం నిర్బంధించడంపై వారు నిరసన వ్యక్తం చేశారు.

 

 

➡️