విద్యార్థిని ఆత్మహత్య కారణాలపై ఆరా

ప్రజాశక్తి – మధురవాడ (విశాఖపట్నం) :విశాఖ కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ డిప్లొమో చదువుతూ గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని రూప శ్రీ కేసుపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఘటనపై కళాశాల యాజమాన్యాన్ని సాంకేతిక విద్యా కమిటీ సైతం నివేదికను కోరింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కళాశాలలో ఉన్న సిసి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. కళాశాల సిబ్బందిని ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఎవరెవరితో రూప శ్రీ ఎక్కువ సన్నిహితంగా ఉండేదో వారిని విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని పిఎం పాలెం సిఐ రామకృష్ణ తెలిపారు.

➡️