ప్రజాశక్తి-నరసరావుపేట(పల్నాడు): నరసరావుపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు కాలనిలో చందు అనే యువకుడు అదే ప్రాంతంలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.
