తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడులు

Apr 15,2024 18:00 #ACB RIDS, #Telangana
  •  పట్టుబడ్డ పలువురు అధికారులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడులు వివిధ చోట్ల అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం అందుకున్న అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ డ్రైవర్‌పై శాఖా పరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఎల్కతుర్తి హౌటల్‌లో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు.

➡️