ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో యుటిఎఫ్ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలు ఆదివార అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఎస్.ఎస్.ఎన్ కళాశాల ఆడిటోరియంలో జరగుతున్న ఈ మహా సభల్లో గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు, గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ పల్నాడు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్ కుమార్, జి.విజయ సారధి, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో జాతీయ, ఎస్.టి.యు, యుటిఎఫ్ పతకాలను ఆడిటోరియం వద్ద ఆవిష్కరించారు. ఎన్.సి.సి సిబ్బంది నుండి ప్రముఖులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.