విశాఖ : భారత్ – పాక్‌ల మధ్య ఉద్రిక్తతల వేళ …. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నేటి నుంచి హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. భారత్-పాక్ యుద్ధం కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు ముగిసిన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. భద్రతా కారణాలతోపాటు నీటి ఎద్దడి, వార్షిక మరమ్మతుల కోసం కూడా హాస్టళ్లు మూసివేస్తున్నట్టు ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు.
