ఏపీలో బోల్తా పడిన ఒరిస్సా గిరిజన వాసుల ఆటో

  • పలువురికి తీవ్రంగా గాయాలు

ప్రజాశక్తి-మన్యం జిల్లా : ఒరిస్సా గిరిజన వాసుల ఆటో బోల్తా పడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కుజ్జాబడి జల గ్రామాల మధ్య కొండపై జరిగింది. ఈ ప్రమాదంలో కాలు, చేతులు విరిగిపోయిన వ్యక్తులు ఆందోళనలో ఉన్న పరిస్థితి చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 9 గంటలకు జల మరియు గుజ్జా బడి గ్రామాల మధ్య రహదారిపై కొండమీద ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలు కాలు, చేతులు విరిగిపోయిన వ్యక్తులు ఆందోళనలో ఉన్న పరిస్థితి నెలకొంది. కొమరాడ మండలం పెద్ద శాఖ పంచాయతీ గుజ్జా బడి గ్రామానికి ఒరిస్సా రాష్ట్రం కేటా గ్రామం నుండి పెళ్లికి ఆదివారం వెళ్లారు. తెల్లవారి పెళ్లి అయిపోయిన తరువాత ఆటోతో తమ స్వగృహానికి వెళుతున్న సందర్భంగా తొమ్మిది గంటల ప్రాంతంలో కుజ్జాబడి జల గ్రామాల మధ్య కొండపై ఉన్న రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కొమరాడ ఎస్సై నీలకంఠం స్పందించి అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వారందరూ ఒరిస్సా గిరిజన ప్రజలు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

➡️