షర్మిల, సునీత విజ్ఞతకే వదిలేస్తున్నా

– వివేకాను నేనే హత్య చేశాననడం సరికాదు : అవినాష్‌
ప్రజాశక్తి-బద్వేలు (వైఎస్‌ఆర్‌ జిల్లా):కడప పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని కడప ఎంపి వైఎస్‌.అవినాష్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం వైసిపి అభ్యర్థి డాక్టర్‌ సుధా తరుపున శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని తానే హత్య చేశానని షర్మిల, సునీత అనడం సరికాదన్నారు. ఇలాంటి మాటలు వినడానికే భయంకరంగా ఉన్నాయని, షర్మిల, సునీత మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. విజ్ఞత కలిగిన వారెవ్వరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ఎన్ని మాటలు అంటారో అనండి, ఎంత ప్రచారం చేస్తారో చేయండి, తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు.

➡️