ప్రజాశక్తి-కడప ప్రతినిధి : కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి పిఎ రాఘవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం కడప నాల్గవ అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్.షర్మిల, సునీత, విజయమ్మపై వర్రాతో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపణల నేపధ్యంలో 16 రోజులుగా పరారీలో ఉన్నారు.